యముడికి అల్లుడు మన అల్లరి నరేష్

 
అల్లరి నరేష్, రిచా పనయ్ జంటగా E .సత్తిబాబు దర్శకత్వం లో ఫ్రెండ్లీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న సోషియో ఫ్యాంటసి చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ డైరెక్టర్ E. సత్తిబాబు గారు ఇది యమలోకంలో జరిగే ఒక ప్రేమ కథ. మన హీరో అల్లరి నరేష్ యమ పుత్రికైన రిచా పనయ్ ను ప్రేమించి ఎన్నో అల్లర్లు చేస్తాడు. ఈ చిత్రంలో కేవలం కామెడీయే కాకుండా సెంటిమెంట్ కుడా ఉంది అని సత్తిబాబు గారు చెప్పారు.
ఇంకా మనకు పరిచయమున్న హాస్య నటులు కృష్ణబగవాన్, గిరిబాబు, బరత్, హేమ, రఘుబాబు, చలపతి, ధర్మవరపు, సుధా వంటి వారు ఈ సినిమా లో ప్రేక్షకులను అలరించనున్నారని తెలియజేసారు.
ఈ సినిమా ఒక క్రొత్త సబ్జెక్టుతో తెరకేక్కించనున్నారని సమాచారం.

No comments:

Post a Comment